Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులపై ఎమ్మెల్సీ తీన్మార్​ మల్లన్న స్పందించారు. బీసీల కోసం మాట్లాడితే నోటీసులు ఇస్తారా అని ఓ టీవీ ఛానెల్​తో అన్నారు. తాను పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించడం తప్పయితే.. యూపీఏ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ కూడా విమర్శలు చేశారని గుర్తు చేశారు. కుల గణన నివేదికను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని చెప్పారు. కొందరు నేతలు బీసీలను పార్టీకి దూరం చేస్తున్నారని ఆరోపించారు. షోకాజ్‌ నోటీసులపై ఈనెల 12లోగా ఆలోచిస్తానని మల్లన్న తెలిపారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  HMDA : హెచ్ఎండీఏ ప‌రిధి పెంచిన తెలంగాణ ప్ర‌భుత్వం.. మొత్తం ఎన్ని జిల్లాలు విలీనం కానున్నాయంటే..!