అక్షరటుడే, ఆర్మూర్: కామారెడ్డిలో ఆదివారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మార్పీఎస్ నాయకుల సమావేశాన్ని నిర్వహించనున్నట్లు శనివారం జిల్లా అధ్యక్షుడు కనక ప్రమోద్ మాదిగ తెలిపారు. ఈ సందర్భంగా మాక్లూర్ మండలం గుత్ప గ్రామంలో మాదిగ కుల సంఘాల సభ్యులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంఈఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు నూతపల్లి మారుతి తదితరులు పాల్గొన్నారు.