అక్షరటుడే, వెబ్‌డెస్క్: MMTS case | హైదరాబాద్ Hyderabad mmts ఎంఎంటీఎస్‌లో అత్యాచారయత్నం కేసుకు MMTS rape attempt case సంబంధించి బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. అసలు యువతిపై అత్యాచార యత్నమే జరగలేదని పోలీసుల విచారణలో police investigation తేలింది.
సదరు యువతి రైలులో నుంచి దూకేయలేదని.. రీల్స్ reels చేస్తూ ట్రెయిన్లో నుంచి జారిపడిందని బయట పడింది. ఈ విషయం చెబితే అందరూ తిడతారని భయపడిన యువతి ఈ కట్టుకథ అల్లిందని తెలిసింది. పోలీసుల విచారణలో police investigation యువతి అసలు నిజం ఒప్పుకుంది.
కాగా.. ఈ ఘటనపై మొదట్లో తీవ్ర దుమారం జరిగింది. ప్రతిపక్షాలు సైతం ప్రభుత్వంపై మండిపడ్డారు. అలాగే ప్రభుత్వ వర్గాలు, అధికారులు సైతం ఈ కేసుపై పలు ప్రకటనలు చేశారు. తీరా ఈ కేసు దర్యాప్తులో అసలు నిజాలు వెలుగు చూడడంతో అంతా షాక్ అయ్యారు. ఓ యువతి రీల్స్ మోజులో పోలీసులనే పిచ్చోళ్ళు చేసిందని అంతా చర్చించుకుంటున్నారు.