అక్షరటుడే, వెబ్‌డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్‌నుంచి రూ.572 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో మొబిక్విక్ సంస్థ ఐపీవోకు వస్తోంది. ఈ కంపెనీ సబ్‌స్క్రిప్షన్ బుధవారం ప్రారంభం కానుంది. దరఖాస్తు చేసుకోవడానికి శుక్రవారం వరకు గడువుంది. ధరల శ్రేణిని ఒక్కో షేరుకు రూ.265–279 వరకు నిర్ణయించారు. ఒక లాట్‌లో 53 షేర్లుంటాయి. ఈ ఐపీవో సబ్‌స్క్రిప్షన్‌లో పాల్గొనాలనుకునేవారు కనీసం రూ.14,787తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రిటైల్ కోటా 10 శాతమే కేటాయించడం, గ్రే మార్కెట్ ప్రీమియం 45శాతం ఉండడంతో అనేకరెట్లు సబ్‌స్క్రైబ్ అవుతుందని భావిస్తున్నారు.