అక్షరటుడే, వెబ్‌డెస్క్: PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi) వచ్చే నెలలో రెండు దేశాల్లో పర్యటించనున్నారు. థాయ్‌లాండ్(Thailand), శ్రీలంక (Sri lanka) దేశాల్లో ఆయన పర్యటించనున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది. ఏప్రిల్ 3-4 తేదీల్లో థాయ్‌లాండ్‌లో జరగనున్న బిమ్‌స్టెక్(BIMSTEC) కూటమి సమావేశంలో మోదీ పాల్గొనన్నారు.
ఆయా దేశాల మధ్య పలు అంశాల్లో సహకారం, వాణిజ్యం తదితర విషయాలపై చర్చించనున్నారు. అనంతరం అక్కడి నుంచి మోదీ ఏప్రిల్ 4న శ్రీలంక(Srilanka)కు బయలు దేరుతారు. ఆ దేశాధ్యక్షుడు దిసనాయకే (Dissanayake) తో మోదీ భేటీ కానున్నారు. అక్కడి పలువురు రాజకీయ నేతలతో కూడా మోదీ సమావేశమవుతారు. భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్మించిన సంపూర్(Sampoor) సోలార్ పవర్ స్టేష్న్ను ఆయన ప్రారంభిస్తారు.
శ్రీలంక పర్యటన ముగించుకొని ప్రధాని నేరుగా తమిళనాడులోని రామేశ్వరం(Rameswaram) చేరుకుంటారు. అక్కడ రామనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ప్రతిష్టాత్మక పంబన్ వంతెనను(Pamban Bridge) ప్రధాని ప్రారంభించనున్నారు.