అక్షరటుడే, ఇందూరు: పీఆర్టీయూ సంఘం క్రియాశీల సభ్యత్వం పొందిన ఉపాధ్యాయులకు సంఘం అండగా ఉంటుందని సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మోహన్ రెడ్డి, కిషన్ అన్నారు. జక్రాన్ పల్లి మండలం లక్ష్మాపూర్ జడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయుడు మల్లికార్జున్ ఇటీవల మృతి చెందగా, శుక్రవారం ఆయన కుటుంబానికి పీఆర్టీయూ ఆధ్వర్యంలో రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో ఎంఈవో శ్రీనివాస్, కాంప్లెక్స్ హెచ్ఎం సురేందర్ రెడ్డి, లింగన్న, మండల అధ్యక్ష కార్యదర్శులు గోపి, రవీణ్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు వినోద్, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు అశోక్ తదితరులు పాల్గొన్నారు.