మోపాల్ సొసైటీ చైర్మన్ గా గంగారెడ్డి

0

అక్షరటుడే, నిజామాబాద్ రూరల్: మోపాల్ సహకార సంఘ చైర్మన్ గా గంగారెడ్డి ఎన్నికయ్యారు. గతంలో సొసైటీ చైర్మన్ గా ఉన్న ఉమాపతిపై డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానాన్ని ప్రకటించి సంబంధిత అధికారులకు నోటీసు అందజేశారు. దీంతో ఉమాపతి ఈనెల 1న తన పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నూతన చైర్మన్ ఎన్నిక కోసం అసిస్టెంట్ రిజిస్ట్రార్ మురళి పర్యవేక్షణలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ముల్లంగికి చెందిన డైరెక్టర్ గంగారెడ్డి ఒక్కరే చైర్మన్ పదవికి నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు.