అక్షరటుడే, వెబ్‌డెస్క్: Chhattisgarh : రూ.200 అడిగితే ఇవ్వనందుకు ఓ కొడుకు దారుణానికి పాల్పడ్డాడు. కుక్కపిల్లను కొనేందుకు డబ్బులు అడిగితే ఇవ్వలేదనే కోపంతో తన కన్న తల్లినే కడతేర్చాడు. ఈ దారుణ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ జిల్లా(Raipur district)లో వెలుగు చూసింది.
పోలీసుల కథనం ప్రకారం.. ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాజధాని రాయ్‌పూర్‌కు చెందిన 45 ఏళ్ల ప్రదీప్ దేవాంగన్ కుక్క పిల్లను కొనాలని అనుకున్నాడు. అందుకు రూ.800 అవసరం కాగా, అతని వద్ద రూ.200 తక్కువగా ఉన్నాయి. ఈ మేరకు తల్లిని డబ్బు అడగటంతో ఆమె నిరాకరించింది.
దీంతో కోపంతో రగిలిపోయిన ప్రదీప్.. పక్కనే ఉన్న సుత్తితో తల్లిపై దాడి చేశాడు. ఆమె తలపై ఇష్టారీతిన బాదాడు. అడ్డు వచ్చిన భార్య రామేశ్వరిపై సైతం దాడి చేశాడు. నానమ్మ, అమ్మపై విచక్షణా రహితంగా దాడి చేస్తున్న తండ్రిని అడ్డుకునేందుకు అతని కొడుకు(15) ప్రయత్నించినా భయపడి బయటకు పరుగులు తీశాడు. ఇరుగుపొరుగు సాయం కోరడంతో స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. దీంతో వారిని చూసిన ప్రదీప్ అక్కడి నుంచి పారిపోయాడు.
తీవ్రంగా గాయపడిన అతడి తల్లి, భార్యను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కాగా, చికిత్స పొందుతూ తల్లి మరణించింది. అతడి భార్య తేరుకుంటోంది. పోలీసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.