MP Arvind | రాష్ట్ర ప్రభుత్వంపై ఎంపీ అర్వింద్​​ సంచలన వ్యాఖ్యలు

MP Arvind | రాష్ట్ర ప్రభుత్వంపై ఎంపీ అర్వింద్​​ సంచలన వ్యాఖ్యలు
MP Arvind | రాష్ట్ర ప్రభుత్వంపై ఎంపీ అర్వింద్​​ సంచలన వ్యాఖ్యలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : MP Arvind | రాష్ట్రంలో అసమర్థ, అవినీతి ప్రభుత్వ corrupt government in Telangana పాలన నడుస్తోందని ఎంపీ ధర్మపురి అర్వింద్​ MP Dharmapuri Arvind అన్నారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో BJP state office శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

Advertisement
Advertisement

రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ financial discipline లేదన్నారు. హామీలు అమలు చేయడంలేదని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలను దోచుకున్న అధికారులను సీఎం రేవంత్​రెడ్డి పక్కన పెట్టుకొని పాలన చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ పాలన వైఫల్యంపై దృష్టి మరల్చడానికి హెచ్​సీయూ భూముల HCU land వివాదం, గతంలో హైడ్రాను Hydra తెరపైకి తెచ్చారని ఆయన విమర్శించారు.

MP Arvind | హామీలు ఎందుకు ఇచ్చారు..?

రాష్ట్రానికి రూ.లక్షల కోట్లు అప్పు ఉందని తెలిసి కూడా రేవంత్​రెడ్డి Revanth Reddy ఎన్నికల సమయంలో ఇన్ని హామీలు ఎందుకు ఇచ్చారని అర్వింద్​ ప్రశ్నించారు. ఇప్పుడు వాటిని అమలు చేయమంటే ఆర్థిక పరిస్థితి బాగా లేదని చెప్పి తప్పించుకుంటున్నారని విమర్శించారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో free RTC buses ఉచిత ప్రయాణం free travel హామీ తప్పా మిగతావి ఏవీ అమలు కావడం లేదన్నారు. ఇంకా చాలా మందికి రైతు భరోసా జమ కాలేదన్నారు.

MP Arvind | వారికి అర్హత లేదు..

హెచ్​సీయూకు 2,300 ఎకరాలు రిజిస్ట్రేషన్​ చేసి ఇస్తే ఏ గొడవ ఉండదని ఎంపీ అన్నారు. బీఆర్​ఎస్​ అధికారంలో ఉన్నప్పుడు యూనివర్సిటీకి భూములు అప్పగించలేదని ఆయన విమర్శించారు. కేటీఆర్​, కవితకు KTR and Kavitha ఇప్పుడు మాట్లాడే అర్హత లేదన్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  MP Arvind | అంబేడ్కర్​ను అవమానించింది కాంగ్రెస్​ పార్టీయే..: ఎంపీ అర్వింద్

MP Arvind | పదవులు కొన్న రేవంత్​

రేవంత్​రెడ్డి రాహుల్​గాంధీకి రూ.500 కోట్లు ఇచ్చి గతంలో పీసీసీ అధ్యక్ష PCC president పదవి తెచ్చుకున్నారని ఎంపీ ఆరోపించారు. తర్వాత రూ.5 వేల కోట్లు ఇస్తానని చెప్పి సీఎం పోస్టు తెచ్చుకున్నారని వ్యాఖ్యానించారు. ఈ మాటలు తాను అనడం లేదని, గతంలో కాంగ్రెస్​ నాయకులే Congress leaders చెప్పారన్నారు. రాష్ట్రంలో మంత్రులు కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపణలు చేశారు.

MP Arvind | కేసీఆర్​పై తీవ్ర వ్యాఖ్యలు

రాష్ట్రంలో ప్రభుత్వం government అసమర్థ పాలన చేస్తుంటే.. ప్రతిపక్షం ఫామ్​హౌస్​లో farmhouse పడుకుందని కేసీఆర్ ను ఉద్దేశించి ఎంపీ విమర్శించారు. ప్రజలు ఇంకా మునిగిపోయి తనను గుర్తు చేసుకుంటే బయటకు వస్తానని కేసీఆర్​ KCR అనుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యక్తి ప్రతిపక్ష నేత opposition leader ఉండడం ప్రజల దౌర్బాగ్యం అన్నారు. బీఆర్​ఎస్​ హయాంలో ఎన్నో అక్రమాలు చోటు చేసుకున్నా.. రేవంత్​ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్నారు. రేవంత్​ రెడ్డి సైతం ప్రజలను దోచుకొని ఆ డబ్బులను ఢిల్లీకి పంపిస్తున్నారని ఆరోపించారు.

హెచ్​సీయూ ల్యాండ్స్​ స్కాం​లో HCU lands scam బీజేపీ నేతలు ఉన్నారని కేటీఆర్​ చేసిన వ్యాఖ్యలపై ఆయనపై స్పందించారు. దమ్ముంటే ఆ ఎంపీ పేరు చెప్పాలని డిమాండ్​ చేశారు. పేరు తెలిస్తే ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. అక్రమాలు జరిగితే ప్రజలకు చెప్పాలని, కోర్టుకు వెళ్లాలన్నారు.

Advertisement