అక్షరటుడే, ఇందూరు: నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ప్రస్తుతం కొనసాగుతున్న ఆర్‌వోబీ నిర్మాణ పనుల్లో వేగం పెంచేలా అధికారులకు తగు సూచనలు జారీ చేయాలని ఎంపీ ధర్మపురి అర్వింద్ కోరారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను ఎంపీ ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. పెండింగ్లో ఉన్న పనులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వారానికి ఒకరోజు నడిచే ఖాజీపేట్ – దాదర్ రైలు మూడుసార్లు నడిచేలా చూడాలన్నారు. దీంతో తొందరలోనే తగు చర్యలు తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. అలాగే పార్లమెంట్ పరిధిలో అవసరమైన చోట్ల నూతన ఆర్‌వోబీలు, ఆర్‌యూబీల నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేయాలని కోరారు. పెండింగ్లో ఉన్న ఆర్మూర్ – ఆదిలాబాద్, బోధన్ – బీదర్ రైల్వే లైన్ల పనులను వేగవంతం చేయాలన్నారు. అమృత్ భారత్ లో భాగంగా రూ.53 కోట్లతో నిజామాబాద్ రైల్వే స్టేషన్లో చేపడుతున్న అభివృద్ధి పనులను మంత్రికి వివరించారు.