అక్షరటుడే, వెబ్డెస్క్: రాజకీయాల్లో కులం కాదు, గుణం ముఖ్యమని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. రాష్ట్రంలో కులగణన సర్వేపై ఆయన స్పందించారు. ఈ సర్వేతో రేవంత్రెడ్డి కులం పంచాయితీ తీసుకొచ్చారని విమర్శించారు. హిందువులను కులాల వారీగా విభజించడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుందన్నారు. ఈ సర్వే ప్రకారం రాష్ట్రంలో క్రిస్టియన్లు లేరా అని ప్రశ్నించారు. మరోవైపు సర్వే ఆధారంగా రాష్ట్ర జనాభా 3,54,75,554 అని సీఎం అసెంబ్లీలో తెలిపారన్నారు. కానీ రాష్ట్రంలో నమోదైన ఓటర్లు 3,35,27,925 ఉన్నారని పేర్కొన్నారు. దీని ప్రకారం రాష్ట్రంలో 18 ఏళ్లలోపు వారు 19.47 లక్షలే ఉన్నారా అని ప్రశ్నించారు. కానీ ఆరేళ్లలోపు పిల్లలే సుమారు 39 లక్షలు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ లో ఉందని వివరించారు. ఇది తప్పుడు సర్వే అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం ఉంటుందని ప్రశ్నించారు.
Advertisement
Advertisement