అక్షరటుడే, భీమ్‌గల్: Indiramma Houses : ఇందిరమ్మ పథకంలో ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు పనులను త్వరితగతిన ప్రారంభించాలని ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ సూచించారు. సోమవారం ఆయన మండలంలోని లింగాపుర్ చౌత్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఎంపికైన 85 మందితో ఆయన పంచాయతీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.
నిబంధనల మేరకు ఇంటి నిర్మాణం చేసుకోవాలన్నారు. బేస్మెంట్ లెవెల్ పూర్తి చేసుకొంటే మొదట రూ.లక్ష అందజేస్తామన్నారు. ఇంటి నిర్మాణ స్టేజ్ ని బట్టి నిధులు విడుదల అవుతాయన్నారు. వీలైనంత తక్కువ ఖర్చుతో నిర్మించుకుంటే తొందరగా పూర్తి చేసుకోవచ్చని తెలిపారు.
అనంతరం ఆయన గ్రామంలో ఐదుగురు లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణానికి మార్కింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా వారికి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ డీఈఈ ప్రభు, ఏఈ సత్యనారాయణ, పంచాయతీ సెక్రెటరీ రాకేష్ తదితరులు పాల్గొన్నారు.