అక్షరటుడే ,ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి నియోజకవర్గంలో గులాబీ పార్టీకి మరో షాక్ తగిలింది. మొన్న ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ పార్టీని వీడగా.. అదేబాటలో తాడ్వాయి ఎంపీపీ రౌడీ రవి బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. నియోజకవర్గంలోని మరి కొందరు ముఖ్య నేతలు సైతం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.