అక్షరటుడే, బోధన్‌: హైదరబాద్‌లో ఈనెల 7న నిర్వహించే లక్ష డప్పులు, వేయి గొంతుకల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి భూమయ్య పిలుపునిచ్చారు. శనివారం అంబేద్కర్‌ చౌరస్తాలో కార్యక్రమ పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మాదిగలు డప్పులతో అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ సీనియర్‌ నాయకులు అద్దంకి లింగన్న, యాదగిరి, అబ్బయ్య, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement