అక్షరటుడే, నిజామాబాద్అర్బన్: కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డిల రాజ్యమని.. మాలల పెత్తనమని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కనక ప్రమోద్ మాదిగ ఆరోపించారు. ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలో సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క టికెట్ కేటాయించకపోవడం సరికాదన్నారు. ఆ పార్టీ కేవలం మాలలకు కొమ్ము కాస్తోందని విమర్శించారు. చివరికి ఉప ఎన్నిక జరుగుతున్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే టికెట్ కూడా మాలలకే కేటాయించిదన్నారు. మాదిగలను విస్మరించిన ఆ పార్టీకి బుద్ధి చెబుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ జాతీయ నాయకుడు మనికొల్ల గంగాధర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు రొడ్డ ప్రవీణ్, నాయకులు యమున, సత్తెక్క, పద్మ, ఐలపాలక సుమన్, సతీశ్, కళ్యాణ్, జీవన్, మోహన్, రవి పాల్గొన్నారు.