ad shoot | ఈ కాంబో అదిరిందిగా.. ధోనిని డైరెక్ట్ చేసిన సందీప్ రెడ్డి వంగా

ad shoot | ఈ కాంబో అదిరిందిగా.. ధోనిని డైరెక్ట్ చేసిన సందీప్ రెడ్డి వంగా
ad shoot | ఈ కాంబో అదిరిందిగా.. ధోనిని డైరెక్ట్ చేసిన సందీప్ రెడ్డి వంగా
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: ad shoot | కొన్ని కాంబినేష‌న్స్ ఊహించ‌ని విధంగా సెట్ అవుతాయి. ఇక వారిని అలా చూసిన‌ప్పుడు ఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధులు ఉండ‌వు. తాజాగా సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ న‌టించాడు. భార‌త్‌కి మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ధోనీ.. ఇప్పుడు ‘అర్జున్ రెడ్డి’ డైరెక్టర్ తో వర్క్ చేసాడు. మిస్టర్ కూల్ గా పిలవబడే ఎంఎస్.. సందీప్ వంగా యాక్షన్ చెప్పగానే కెమెరా ముందు ‘యానిమల్’గా మారిపోయి అద‌ర‌గొట్టాడు. ఎలాంటి బౌల‌ర్ బౌలింగ్ లో అయిన హెలికాఫ్టర్ షాట్స్ కొట్టడమే కాదు.. యాక్టింగ్ కూడా చేయగలనని నిరూపించాడు… ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుంది.

ad shoot | అద్దిరింది..

సినిమా దర్శకులకు క్రికెటర్స్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ చాలా తక్కువ‌గా వ‌స్తూ ఉంటుంది. క్రికెటర్స్ ఎప్పుడో గానీ సినిమాల్లో గెస్ట్ అప్పీయరెన్స్ ఇవ్వరు కాబట్టి. కానీ అది యాడ్ ఫిల్మ్ అయితే తరచుగా ఛాన్స్ దక్కుతుందని చెప్పొచ్చు. మాజీ క్రికెట‌ర్ ఎమ్మెస్ ధోనీ సైతం చాలా బ్రాండ్స్ కు అంబాసిడర్ గా ఉన్నాడు. ఈ క్ర‌మంలో తాజాగా ఎం.ఎస్. ధోనీ చేసిన ఓ యాడ్ ను ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేశాడు.ఇక్క‌డ‌ విశేషం ఏమంటే… యానిమల్ ని ధీమ్ గా తీసుకొని అందులోని హీరో రణబీర్ కపూర్ మాదిరిగానే ధోనీని ఈ యాడ్ లో ప్రజెంట్ చేశాడు. అదే యాటిట్యూడ్ ను కాస్తంత భిన్నంగా ధోనీతో రీక్రియేట్ చేశాడు.

ఈ యాడ్ మేకింగ్ విజువల్స్ ఇప్పుడు వైరల్ గా మారిపోయింది. ఫైనల్ గా రణబీర్ సిగ్నేచర్ మూమెంట్ నూ ధోనీతో సందీప్ వంగ చేయించడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అయింది.యానిమల్‌’లో రణ్‌బీర్ కపూర్‌‌ను పోలిన లుక్‌లో ధోని కారులో నుంచి దిగడం, నడుచుకుంటూ వెళ్లడం, సందీప్ వంగా విజిల్ వేయడం మాత్రం మాములుగా లేవు. యాడ్ కోసం వీరిద్ద‌రు క‌లిసి ఇలా చేశారంటే ఇక సినిమా చేస్తే ఎలాంటి ప్ర‌భంజ‌నం సృష్టిస్తారో అని అంద‌రు ముచ్చ‌టించుకుంటు్న్నారు.

Advertisement