అక్షరటుడే, వెబ్‌డెస్క్ MS Dhoni : మహేంద్ర సింగ్ ధోని.. అందరం మిస్టర్ కూల్ అని పిలుచుకుంటాం. గెలిచినా.. ఓడినా.. ధోని ఎప్పుడూ కూల్‌గానే కనిపిస్తాడు. భారత్ క్రికెట్‌లో ఆయన పేరుపై ప్రత్యేక అధ్యాయం లిఖించి ఉంటుంది. మహేంద్ర సింగ్ ధోని భారతదేశం తరపున 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. కొద్ది నెలల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన ధోని ఇప్పుడు ఐపీఎల్ 2025లో ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ఐపీఎల్‌లో ధోని చెన్నై సూపర్ కింగ్స్ తరఫున మరోసారి బరిలోకి దిగబోతున్నాడు.
MS Dhoni : అంత పెన్షన్ ఇస్తున్నారా..
ధోని మైదానంలో దిగితే చూడాలని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ధోనికి ఇదే ఆఖరి సీజన్ అంటూ మరోసారి ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ధోని నాయకత్వంలో టీమిండియా 2007లో టీ20 ప్రపంచ కప్, 2011లో వన్డే ప్రపంచ కప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. ఇక ఆటగాళ్లు క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత వారికి బీసీసీఐ నుంచి పెన్షన్ అందుతుంది. ధోనికి కూడా బీసీసీఐ నుంచి నెలవారీ పెన్షన్ అందుతోంది. అయితే, ధోని ప్రతి నెలా బోర్డు నుంచి రూ.70 వేల వరకు పెన్షన్ వస్తుందట. 2022లో అప్పటి బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నాయకత్వంలో ఈ పథకంలో సంస్కరణలు తీసుకురావడంతో పెన్షన్ వాల్యూ కాస్త పెరిగింది.
అయితే ధోని తనకి వచ్చిన పెన్షన్‌ని సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తాడని సమాచారం. పెన్షన్ అనేది పురుషులకే కాకుండా మహిళలకు కూడా అందజేయడం జరుగుతుంది. వారి క్రీడా జీవితం ఆధారంగా పెన్షన్ మొత్తాన్ని నిర్ణయిస్తారు. ధోనికి రూ.70 వేల పెన్షన్ వస్తుంది అంటే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక ధోని కేరీర్ విషయానికి వస్తే.. ధోని తన కెప్టెన్సీలో 2007లో భారతదేశానికి తొలి ఐసీసీ టైటిల్ అయిన టీ20 ప్రపంచ కప్‌ను అందించాడు. ధోని కెప్టెన్సీలో, చెన్నై సూపర్ కింగ్స్ రారాజుగా అవతరించింది. తలా నాయకత్వంలో సీఎస్కే జట్టు 2010, 2011, 2018, 2021, 2023 మొత్తంగా ఐదుసార్లు విజేతగా నిలిచింది.