అక్షర టుడే, వెబ్ డెస్క్ MS Dhoni : ఈ సారి ఐపీఎల్‌లో (IPL 2025) చెన్నై చెత్త ప్రదర్శన కనబరుస్తోంది. వరుసగా ఓటముల పాలవుతోంది. కెప్టెన్ మారినా చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) రాత మారలేదు. ఎంఎస్ ధోని (MS Dhoni) సారథ్యంలోనైనా చెన్నై విజయాల బాట పడుతుందని ఆశించిన అభిమానులకు శుక్రవారం మ్యాచ్‌లో నిరాశే ఎదురైంది. చెపాక్ మైదానంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ (Kolkata Knight Riders) చేతిలో 8 వికెట్ల తేడాతో ఘోర పరాభవాన్ని మూట గట్టుకుంది. ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు (Chennai Super Kings) ఇది వరుసగా ఐదో ఓటమి కావడం గమనార్హం. అటు కేకేఆర్‌కు మూడో విజయం. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. శివమ్ దూబె (31 నాటౌట్; 29 బంతుల్లో 3 ఫోర్లు), విజయ్ శంకర్ (29; 21 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్) ఓ మోస్తరుగా రాణించారు.
MS Dhoni : ధోని రికార్డ్..
అయితేఈ మ్యాచ్‌లో ధోని (MS Dhoni) సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ (IPL 2025) లో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన అన్‌క్యాప్డ్ ప్లేయర్ గా రికార్డ్ సృష్టించాడు ధోని (MS Dhoni). గాయం కారణంగా సీఎస్కే రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (Captain Ruturaj Gaikwad) మొత్తం సిరీస్ కు దూరంగాఉండడంతో ఎంఎస్ ధోనికి (MS Dhoni)కెప్టెన్సీ ఇవ్వబడింది. ఇప్పుడు ధోని ఐపీఎల్ చరిత్రలో అన్‌క్యాప్డ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. మహీకి ముందు ఇప్పుడు వరకు ఏ అన్‌క్యాప్డ్ ఆటగాడు ఐపీఎల్‌లో కెప్టెన్ గా వ్యవహరించలేకపోయాడు. కానీ ఇప్పుడు ఎంఎస్ ధోని ఈ ఘనత సాధించి చరిత్ర సృష్టించాడు. వాస్తవానికి ఏ ఆటగాడు అయినా 4 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం భారత జట్టుకు దూరంగా ఉంటే అతడిని అన్‌క్యాప్డ్ ప్లేయర్ గా పరిగణిస్తారు.
ధోని భారత్ తరపున ఆడి దాదాపు 5 సంవత్సరాలు అయ్యింది. అంటే ధోని ఐపీఎల్ 2025లో అన్‌క్యాప్డ్ ప్లేయర్ గా పాల్గొంటున్నాడు. ఇది కాకుండా ఐపీఎల్ లో కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన అతిపెద్ద వయస్సు ఆటగాడిగా ఎంఎస్ ధోని నిలిచాడు. ప్రస్తుతం ధోని వయస్సు 43 సంవత్సరాల 278 రోజులు. మరోవైపు ఎంఎస్ ధోని 683 రోజుల తర్వాత కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టాడు. చివరిగా 2023లో ధోని కెప్టెన్ గా వ్యవహరించాడు. కేకేఆర్ చేతిలో చెన్నై ఓడిపోవడంతో ధోని నిరాశ చెందాడు. మ్యాచ్ అనంతరం తమ జట్టు ఓటమిపై మహేంద్రుడు మాట్లాడుతూ.. తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నామని చెప్పుకొచ్చాడు. బ్యాటర్లుBatters విఫలం అయ్యారని అన్నాడు. స్కోరు బోర్డు పై తగినన్ని పరుగులు లేవని అంగీకరించాడు. వికెట్లు పడినప్పుడు జట్టు పై ఒత్తిడి వస్తుందన్నాడు.