అక్షర టుడే, వెబ్ డెస్క్ MS Dhoni : ఐపీఎల్ 2025లో సీఎస్కే సరైన ప్రదర్శన కనబరచడం లేదు. ఈ రోజు డీసీతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై జట్టు 25 పరుగుల తేడాతో ఓడింది. ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) పరిస్థితి ఏం బాగోలేదు. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్‌లలో కేవలం ఓకే ఒక్క మ్యాచ్‌లో గెలిచింది. నేడు చెన్నై తన నాలుగో మ్యాచ్‌ని సొంత మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) టీంతో తలపడగా, ఈ మ్యాచ్‌లోను ఓడి ఫ్యాన్స్‌ని నిరుత్సాహ పరిచింది. 184 పరుగుల లక్ష్యంతో చెన్నై రంగంలోకి దిగింది. అయితే ఛేదనలో మరోసారి కష్టాల్లో పడింది. ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) బౌలర్ల విజృంభణతో పవర్ ప్లేలో మూడు కీలక వికెట్లు కోల్పోయింది. 41 పరుగులకే టాప్ బ్యాట్స్‌మెన్స్ పెవిలియన్ చేరడంతో సీఎస్కే ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా శివం దూబే(12)ను తీసుకున్నారు. అతను నిరాశపరిచాడు.
MS Dhoni : ధోని రిటైర్మెంటా..
విజయ్ శంకర్ (Vijay Shankar) ( 54 బంతుల్లో 69; 5 ఫోర్స్, ఒక సిక్స్), ధోని (26 బంతుల్లో 30 నాటౌట్) కాస్త విలువైన భాగస్వామ్యం నెలకొల్పడంతో 20 ఓవర్లకి గాను 5 వికెట్స్ కోల్పోయి 158 పరుగులు చేసింది. మిగతా బ్యాట్స్‌మెన్స్ ఎవరు రాణించలేదు. ఐపీఎల్ 18వ సీజన్‌లో అజేయంగా దూసుకెళ్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ మూడో మ్యాచ్‌లోనూ భారీ స్కోర్ చేసింది. చెపాక్ chepak స్టేడియంలో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్(77) దంచికొట్టాడు. యువకెరటం అభిషేక్ పొరెల్(33), కెప్టెన్ అక్షర్ పటేల్(21)లు మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. వీళ్లిద్దరూ త్వరగానే వెనుదిరిగినా మిడిల్ ఓవర్లలో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లను రాహుల్ బెంబేలెత్తించాడు. ఇక ఆఖర్లో ట్రిస్టన్ స్టబ్స్(24) ధనాధన్ ఆడాడు. వీళ్లిద్దరి మెరుపులతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది.
ఇక ఈ రోజు (శనివారం, 5 ఏప్రిల్ 2025) ఐపీఎల్‌కు ధోనీ రిటైర్మెంట్ (Dhoni retirement) ప్రకటించబోతున్నాడనే వార్త అభిమానులను కలవరపాటుకు గురి చేసింది. ఎప్పుడూ రాని ధోనీ Dhoni తల్లిదండ్రులు మ్యాచ్‌కు రావడంతో అంతా దీనిపై చర్చించుకున్నారు. చాలా కాలం తర్వాత వాళ్లిద్దరు చెన్నైలోని చెపాక్ స్టేడియంలో మ్యాచ్ చూడడానికి రావడంతో అందరికి అనుమానం మొదలైంది. తమ కొడుకును ఉత్సాహపరిచేందుకు, చివరిసారిగా ధోని ఆటను చూసేందుకు మైదానంలోకి వచ్చారని పుకార్లు వినిపిస్తున్నాయి. ఎంఎస్ ధోని IPLలో 267 మ్యాచ్‌లు ఆడాడు. ఈ 267 మ్యాచ్‌లలో, అతను 232 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేసి 39.18 సగటు, 137.70 స్ట్రైక్ రేట్‌తో 5,289 పరుగులు చేశాడు.