అక్షర టుడే, వెబ్ డెస్క్ MS Dhoni : ఐపీఎల్ 2025లో (IPL 2025) ఆసక్తికర మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ప్రతి మ్యాచ్ కూడా రసవత్తరంగా సాగుతుంది. అయితే ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా (IPL Champion) నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) జట్టు శనివారం జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో మళ్లీ ఎంఎస్ ధోని (MS Dhoni) చెన్నైకి నాయకత్వం వహించే అవకాశం ఉందని ఇప్పుడు చర్చ నడుస్తుంది. సాధారణంగా సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్. (Ruturaj Gaikwad) అతడే జట్టును నడిపించాలి. అయితే రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గైక్వాడ్ కుడి చేతి భుజానికి గాయం కావడం మనం చూశాం.తుషార్ దేశ్‌పాండే వేసిన బంతి అనూహ్యంగా ఎగిరి, అతడి చేతికి బలంగా తాకింది. దీంతో గైక్వాడ్ గాయపడ్డాడు.
MS Dhoni : ధోనికి బాధ్యతలు..
అయినప్పటికీ గైక్వాడ్ (Ruturaj Gaikwad) ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్ కొనసాగించాడు. కానీ ఆ తర్వాత నుంచి అతడు ప్రాక్టీస్ సెషన్లకు హాజరు కాలేదు. సీఎస్కే బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ మాట్లాడుతూ.. గైక్వాడ్ ను మ్యాచ్‌కు అందుబాటులో ఉంచాలా లేదా అనే విషయాన్ని నెట్ సెషన్‌లో అతడు ఎలాంటి ప్రదర్శన చేస్తాడో బట్టి నిర్ణయిస్తాం అని చెప్పాడు. అతడు ప్రస్తుతం కొంత నొప్పితో బాధపడుతున్నాడు. కానీ అతడి గాయం రోజురోజుకు కాస్త మెరుగవుతోంది. అతను ఆడతాడనే ఆశాభావంతో ఉన్నాం అని చెప్పాడు. ప్రస్తుతం కెప్టెన్‌గా ఉన్న రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) గాయంతో బాధపడుతున్న నేపథ్యంలో, జట్టుకు మరో ప్రత్యామ్నాయ కెప్టెన్ అందుబాటులో లేకపోవడంతో, ధోని (MS Dhoni) మళ్లీ పగ్గాలు చేపట్టే అవకాశం వచ్చింది.
మ్యాచ్ జరగనున్న ఎంఏ చిదంబరం స్టేడియం పిచ్ నెమ్మదిగా ఉండే అవకాశం ఉంది, స్పిన్నర్లకు అనుకూలంగా ఉండే వాతావరణంతో బ్యాటింగ్‌కి కొంత కష్టంగా ఉంది మారే సూచనలు ఉన్నాయి. మధ్యాహ్నం మ్యాచ్ కావడంతో మంచు ప్రభావం ఉండకపోవచ్చు, టాస్ Toss ప్రభావం తక్కువగా ఉండే అవకాశం ఉంది. వ్యూహాత్మక బౌలింగ్, శ్రద్ధతో కూడిన బ్యాటింగ్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ధోని మళ్లీ కెప్టెన్సీ చేపడతారా? లేక గైక్వాడ్ గాయాన్ని అధిగమించి జట్టుకు నడిపించగలడా? అనే ప్రశ్నలు శనివారం మ్యాచ్‌కు ముందు తేలనున్నాయి. అభిమానులు మాత్రం చెపాక్ వేదికపై మళ్లీ ధోని(MS Dhoni) నాయకత్వాన్ని చూడాలని ఆశగా ఎదురు చూస్తున్నారు.