అక్షరటుడే, కోటగిరి : మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానం చేసిన పోలీస్‌ కిష్టయ్య పోరాటం స్ఫూర్తిదాయకమని ముదిరాజ్‌ నాయకులు పేర్కొన్నారు. పోలీస్‌కిష్టయ్య వర్ధంతి కార్యక్రమాన్ని పోతంగల్‌ బస్టాండ్‌ వద్ద పోలీస్‌ కిష్టయ్య చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన జయంతి, వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ప్రతి మండలంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో గణేశ్, హన్మాండ్లు, భూమయ్య, గంగారం, గోపాల్‌, శంకర్‌, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.