అక్షరటుడే, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని రోడ్లను ఆక్రమించుకొని ఏర్పాటు చేసిన వ్యాపార సముదాయాలను మున్సిపల్, పోలీస్ అధికారులు గురువారం తొలగించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి డీఎస్పీ ఆఫీస్, తహశీల్దార్ కార్యాలయం, కోర్టు ఆవరణను ఆనుకొని రోడ్లపై అడ్డంగా ఏర్పాటు చేసిన వ్యాపార సముదాయాలను తీసివేయించారు. రోడ్లను ఆక్రమిస్తూ వ్యాపార సామాగ్రిని పెట్టవద్దని హెచ్చరించారు.