అక్షరటుడే, కామారెడ్డి టౌన్: కామారెడ్డి పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ పేర్కొన్నారు. పట్టణంలోని దేవునిపల్లి డబుల్ బెడ్ రూం కాలనీవాసుల కోసం మంగళవారం బోరు వేయించారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. సీజనల్ వ్యాధులు వ్యాపిస్తున్నందున పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. త్వరలోనే అధికారులతో చర్చించి ఇండ్ల పట్టాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని హామీఇచ్చారు. కౌన్సిలర్లు పాత శివ కృష్ణమూర్తి, పంపరి లతా శ్రీనివాస్, వనిత రామ్మోహన్, మాజీ కౌన్సిలర్ జూలూరు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.