అక్షరటుడే, ఆర్మూర్‌: ఆర్మూర్‌ మున్సిపల్‌ పరిధిలోని మల్లారెడ్డి చెరువు పరిశుభ్రత పనులను శుక్రవారం మున్సిపల్‌ ఛైర్ పర్సన్‌ లావణ్య అయ్యప్ప శ్రీనివాస్‌ పరిశీలించారు. చెరువులోని వ్యర్థాలను మున్సిపల్‌ పారిశుధ్య సిబ్బంది తొలగించారు. ఈ సందర్భంగా లిక్విడ్‌ ట్రీ ఢిల్లీ ఎన్సీఆర్‌ బృందం సభ్యులు సైనో బ్యాక్టీరియాపై పరిశోధన నిమిత్తం ఆర్మూర్‌లోని మల్లారెడ్డి చెరువును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ షేక్‌ మున్ను, కౌన్సిలర్‌ గంగామోహన్‌ చక్రు, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.