అక్షరటుడే, కామారెడ్డి టౌన్: పట్టణంలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ పేర్కొన్నారు. పట్టణంలోని 47వ వార్డులో నీటి సమస్య ఉందని కౌన్సిలర్ ఆమె దృష్టికి తీసుకురావడంతో బుధవారం బోరు వేయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుజాత, వార్డ్ కౌన్సిలర్ గేరిగంటి లక్ష్మీనారాయణ, పాత శివ కృష్ణమూర్తి, పంపరి లతా శ్రీనివాస్, చాట్ల వంశీ, పిడుగు మమత సాయిబాబా, నజీరుద్దీన్, పిట్ల వేణు, మాజీ కౌన్సిలర్ జూలూరు సుధాకర్ పాల్గొన్నారు.