అక్షరటుడే, భీమ్‌గల్: పట్టణంలో ప్రధాన రహదారుల వెంబడి, డివైడర్లపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలని మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ ఆదేశించారు. ఇకపై ఫ్లెక్సీల ఏర్పాటుకు అనుమతి పొందాలని సూచించారు. అనుమతి లేకుండా ఫ్లెక్సీలు పెడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.