అక్షరటుడే, బాన్సువాడ: మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులకు పీఎఫ్ సౌకర్యం లేక ప్రయోజనాలు పొందలేకపోతున్నారని సీఐటీయూ జిల్లా నాయకుడు రవీందర్ అన్నారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయం ముందు కార్మికులతో కలిసి బైఠాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో 145 మంది కార్మికులు పని చేస్తుంటే, 50 మందికి పీఎఫ్ సౌకర్యం కల్పించలేదన్నారు. ఆరేళ్లుగా కార్మికులు విధులు నిర్వహిస్తున్నా పీఎఫ్ ఖాతాలు తెరవలేదని, నెలాఖరులోగా ఖాతాలు తెరవకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సాయిలు, రాజు, శివరాజులు, మొగులయ్య, స్వాతి రెడ్డి, సునంద, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
Banswada | మున్సిపల్ కార్మికులకు పీఎఫ్ చెల్లించాలి
Advertisement
Advertisement