KAMAREDDY | మున్సిపల్‌ కార్మికులు నిబద్ధతతో పనిచేయాలి
KAMAREDDY | మున్సిపల్‌ కార్మికులు నిబద్ధతతో పనిచేయాలి
Advertisement

అక్షరటుడే, కామారెడ్డి: KAMAREDDY | పట్టణంలోని మున్సిపాలిటీలో కొందరు పారిశుధ్య కార్మికులు పని చేయకుండా వేతనాలు తీసుకుంటున్నారని, ఈ విషయమై మార్పు రావాలని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి హెచ్చరించారు. సోమవారం మున్సిపల్‌ కార్యాలయంలో వివిధ విభాగాల కార్మికులు, యూనియన్‌ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్మికులు నిబద్ధతతో పని చేయాలని, లేకుంటే విధుల నుంచి ఉన్నతాధికారులు తొలగిస్తారని హెచ్చరించారు. అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులు కొందరు ఇన్‌ఫార్మర్లుగా మాత్రమే పనిచేస్తున్నారని, తీరు మార్చుకోవాలని సూచించారు. ఏ అధికారి ఇళ్లలోనూ కార్మికులు పనిచేయవద్దని చెప్పారు. కార్మికులకు జీతాలు, ఈఎస్‌ఐ, పీఎఫ్‌ పూర్తయిన తర్వాతే బిల్లులు చెల్లించాలని అధికారులను ఆదేశించారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Dogs bite | 13 మందిని కరిచిన కుక్కలు