అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నియమితులైన ముప్ప గంగారెడ్డిని మోపాల్ మండలంలోని పలువురు కాంగ్రెస్ నాయకులు మంగళవారం ఘనంగా సన్మానించారు. నగరంలోని వినాయక్‌నగర్‌లో ఆయన స్వగ్రహంలో ఎల్లమ్మకుంట, తాడెం, కాల్పోల్, మంచిప్ప, కంజర గ్రామాల నాయకులు కలిశారు. కార్యక్రమంలో ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు యాదగిరి, మోపాల్ మాజీ మండలాధ్యక్షుడు రవి, సాయికుమార్, ముత్యంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.