అక్షరటుడే, వెబ్డెస్క్: Actor | కమెడీయన్ బాబు మోహన్ ఈ నాటి తరానికి అంతగా తెలియకపోవచ్చు కాని అప్పట్లో బాబు మోహన్ కామెడీకి ప్రత్యేకమైన అభిమానులు ఉండేవారు. కమెడియన్ గా తనకంటూ తెలుగు పరిశ్రమలో కొన్ని పేజీలు లిఖించబడ్డాయి. బాబు మోహన్, కోట శ్రీనివాసరావు కామెడీకి తన్మయత్వం చెందని వారు లేరు. అయితే మనల్ని ఎంతగానో నవ్వించే బాబు మోహన్ జీవితంలో కొన్ని విషాద సంఘటనలు ఉన్నాయి. ఆయన కుమారుడు రోడ్డు ప్రమాదంలో కన్నుమూసాడు. దాంతో చాన్నాళ్లపాటు బాబు మోహన్ అదే బాధలో ఉన్నారు. ఇక ఆ తర్వాత తేరుకొని మళ్లీ సినిమాలు చేస్తూ రాజకీయాల్లోనూ చక్రం తిప్పారు. ప్రస్తుతం సినిమా…రాజకీయం రెండు రంగాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బాబు మోహన్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న విషయాన్ని తెలియజేశాడు.
Actor | దారుణం..
సినిమాలతో బిజీగా ఉన్న సమయంలో తనకు పాన్ తినే అలవాటు ఎక్కువైందని, రోజుకు కొన్నిసార్లు 30కి పైగా పాన్లు తినే వాడినంటూ బాబు మోహన్ తెలిపారు. ఇక తాను బయటకు వెళ్లిన సమయంలో కొన్ని పాన్లు ప్యాక్ చేసుకునేవాడిని అని కూడా అన్నారు. అయితే ఓ సారి అలా వెళ్తున్న సమయంలో తనపై విష ప్రయోగం జరిగిందంటూ బాబు మోహన్ ఇంటర్వ్యూలో తెలియజేశారు. తాను హైదరాబాద్ రావాలి అంటే సంగారెడ్డి మీదుగా వచ్చే వాడినని, ఆ మార్గం మధ్యలో ఓ పాన్ షాపులో ఎప్పుడూ పాన్ కట్టించుకుంటానని బాబు మోహన్ తెలియజేశాడు. అయితే ఓ సారి పాన్ కట్టించుకొని వెళ్తుండగా, మెయిన్ రోడ్డు మీదకు వచ్చాను.
అప్పుడే ఒక కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్‌లో ఒకావిడ చెప్పిన మాటలు విని షాకయ్యాయని బాబు మోహన్ అన్నారు మీరు ఆ పాన్ తినొద్దు అని, అందులో విషం కలిపి ఇచ్చారని ఆవిడ చెబుతూ తెగ ఏడ్చేసింది. అయితే ఆ మహిళ మరెవరో కాదు పాన్ కట్టిన వ్యక్తి భార్యనే. అయితే కొందరు వ్యక్తులు వారిని బెదిరించిన నేపథ్యంలో ఆమె అలా చేసినట్టుగా తనకు చెప్పి ఏడ్చేసిందని బాబు మోహన్ అన్నారు. ఇక ఇది చూసాక రాజకీయాలు మరీ ఇంత దారుణంగా ఉంటాయా అని నాకు అనిపించింది అని బాబు మోహన్ స్పష్టం చేశారు.