అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad police | నగర శివారులోని పాంగ్రా(Pangra)లో ఇటీవల జరిగిన మహిళ హత్య కేసు నిందితుడు పోలీసుల(Police) అదుపులో ఉన్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళ్తే.. పాంగ్రాలో ఒంటరిగా నివసించే మహిళకు కామారెడ్డి(Kamareddy)కి చెందిన ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతడు ఈ నెల 23న ఆమె ఇంటికి వచ్చాడు. సదరు మహిళ వద్ద ఉన్న అరతులం బంగారం కోసం ఆమెను ఇంట్లో ఈలపీటతో గొంతు కోసి హత్య చేసినట్లు తెలుస్తోంది. విచారణ చేపట్టిన 4వ టౌన్ పోలీసులు సీసీ ఫుటేజీ(CCTV footage) ఆధారంగా ఒకటో తేదీన నగరంలోని గాంధీచౌక్(Gandhi Chowk) వద్ద నిందితుడికి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
Nizamabad police | పోలీసుల అదుపులో హత్యకేసు నిందితుడు..?
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : రేషన్ కార్డ్ దరఖాస్తు చేసుకున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవల్సిందే..!
Advertisement