అక్షరటుడే, వెబ్‌డెస్క్: ChatGPT : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఫేమస్ కంపెనీ అయిన ఓపెన్ ఏఐ(Open AI) నుంచి త్వరలో కొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రాబోతోంది. ‘X’ కు పోటీగా ఉండే ఈ ప్లాట్ఫామ్లో అనేక AI ఫీచర్లు ఉండబోతున్నాయి. ఎలాన్ మస్క్ ‘ఎక్స్'(Elon Musk ‘X’), మార్క్ జూకర్‌బర్గ్(Mark Zuckerberg) యాజమాన్యంలోని మెటా-ఓన్డ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌కు చాట్‌జీపీటీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ గట్టి పోటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ది వెర్జ్ నివేదిక ప్రకారం.. “X-లాంటి సోషల్ నెట్‌వర్క్” (X-like social network)ను అభివృద్ధి చేసే యోచనలో ఓపెన్ ఏఐ ఉంది. మల్టీఫుల్ అనోనిమస్ సోర్స్‌ను ఉటంకిస్తూ ఈ ప్లాట్‌ఫామ్ ఇంటర్నల్ ప్రోటోటైప్ ఇప్పటికే క్రియేట్ అయినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ ప్రోటోటైప్ చాట్‌జీపీటీ GPT-4o-ఆధారిత ఇమేజ్ జనరేషన్ కేపబిలిటీస్(ChatGPT’s GPT-4o)పై ఫోకస్ చేస్తుందంటున్నారు.
ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మాన్(Open AI CEO Sam Altman)ఈ ప్రోటోటైప్పై కంపెనీ నుంచి కాకుండా బయటి నుంచి ఫీడ్‌బ్యాక్ కోరినట్లు చెబుతున్నారు. కాగా, ఇది స్టాండలోన్ యాప్(Standalone app)గా ప్రారంభం కానుందా.. లేదా ChatGPTలో విలీనం చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది. ఆసక్తికరంగా కంపెనీ వీడియో క్రియేషన్ ప్లాట్‌ఫామ్ అయిన సోరా సైతం ఇలాంటి ఫీడ్‌నే కలిగి ఉంది.