Myanmar earthquake | మృతుల దిబ్బగా మయన్మార్​.. రెండు వేలు దాటిన భూకంప మృతుల సంఖ్య

Myanmar earthquake | మృతుల దిబ్బగా మయన్మార్​..రెండు వేలు దాటిన భూకంప మృతుల సంఖ్య
Myanmar earthquake | మృతుల దిబ్బగా మయన్మార్​..రెండు వేలు దాటిన భూకంప మృతుల సంఖ్య

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Myanmar earthquake : మయన్మార్‌(Myanmar)లో సంభవించిన భారీ భూకంపం(Earthquake)తో శవాల కుప్పలు పేరుకుపోతున్నాయి. తీవ్రమైన ప్రకృతి విపత్తు(natural disaster) కారణంగా మరణించిన వారి సంఖ్య 2,056 కు పెరిగిందని సైనిక దళాలు ప్రకటించాయి. భూకంపం వల్ల 3,900 మందికి పైగా గాయపడ్డారు. మరో 270 మంది కనిపించడం లేదని సైనిక దళాలు తెలిపాయి.

Advertisement
Advertisement

Myanmar earthquake : సంతాప దినాలు..

విపత్తు వల్ల జరిగిన నష్టానికి సంతాపంగా.. మయన్మార్​ సర్కారు(Myanmar government) వారం రోజులు సంతాప దినాలు(week of mourning)గా ప్రకటించింది. ప్రాణనష్టం, ఆస్తి నష్టాలకు సంతాపంగా ఏప్రిల్ 6 వరకు సంతాప దినాలుగా పాటించాలని ఆదేశించింది.

Myanmar earthquake : ఇంకా గుడారాల్లోనే ప్రజలు

భూకంపం వల్ల అత్యంత ప్రభావితమైన నగరాల్లో ఒకటి మండలే(mandale). 1.7 మిలియన్ కు పైగా జనాభా ఉన్న ఈ నగరంలో ప్రకంపనలు ఇంకా కొనసాగుతుండటంతో ప్రజలు ఇళ్లల్లోకి వెళ్లాలంటే భయపడుతున్నారు. ఇంకా గుడారాల్లోనే ఉండిపోతున్నారు. టెంట్లు లేని చాలా మంది చిన్న పిల్లలతో సహా రోడ్ల మధ్యలో దుప్పట్లు వేసుకుని పడుకుంటున్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Myanmar earthquake | శిథిల భవనాలు.. శవాల కుప్పలు.. విపత్తు మిగిల్చిన విషాదం

మయన్మార్​లో 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం అక్కడి రోడ్లపై విస్తృత పగుళ్లను సృష్టించింది. భవనాలు కూలిపోయాయి. పొరుగు దేశాలైన చైనా, థాయిలాండ్, వియత్నాం, భారతదేశం(China, Thailand, Vietnam, India)లోని కొన్ని ప్రాంతాల్లోనూ ప్రకంపనలు ఏర్పడ్డాయి.

Advertisement