Nadendla Manohar : పవన్ కళ్యాణ్ వల్లనే చంద్రబాబు సీఎం అయ్యారు : నాదెండ్ల మనోహర్

Nadendla Manohar : పవన్ కళ్యాణ్ వల్లనే చంద్రబాబు సీఎం అయ్యారు : నాదెండ్ల మనోహర్
Nadendla Manohar : పవన్ కళ్యాణ్ వల్లనే చంద్రబాబు సీఎం అయ్యారు : నాదెండ్ల మనోహర్
Advertisement

అక్ష‌ర‌టుడే, వెబ్‌డెస్క్‌ Nadendla Manohar : ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం నడుస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీ ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేయడం వల్ల అప్పటి వరకు అధికారంలో ఉన్న వైసీపీని ఓడించాయి.. ఓడించగలిగాయి. మూడు పార్టీలు ఏకమవడంలో ముఖ్యపాత్ర పోషించింది ఎవరో కాదు.. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ఆయన వల్లనే నేడు ఏపీలో కూటమి ప్రభుత్వం నడుస్తోందని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.

ఆనాడు చంద్రబాబును గత వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేసి జైలులో పెడితే.. చంద్రబాబుకు తాను తోడుగా ఉంటానని.. ఏపీలో వైసీపీ అంతానికి ఇదే నాంది అని నొక్కి చెప్పి మరీ టీడీపీతో జతకట్టారు పవన్ కళ్యాణ్. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా టీడీపీని, చంద్రబాబును వదల్లేదు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈనేపథ్యంలో జనసేన పార్టీ ఎమ్మెల్యే, ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము ప్రభుత్వంలో భాగస్వాములం. టీడీపీ నుంచి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారి వల్లనే అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Pawan Kalyan : పవన్ కళ్యాణ్ వీరమల్లు మళ్లీ వాయిదానా.. పాపం నిర్మాతల పరిస్థితి ఏంటో..?

Nadendla Manohar : జనసేన పార్టీ వల్లనే కూటమి ప్రభుత్వం

అలాగే.. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిందంటే దానికి కారణం.. జనసేన పార్టీనే అని, పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ, పార్టీ కార్యకర్తలు, జనసైనికులు అందరూ ఏపీ అంతటా ప్రచారం చేసి టీడీపీకి మద్దతు పలకడం వల్లనే నేటి టీడీపీ కూటమి అధికారంలో ఉందని.. అమలాపురంలో జరిగిన జనసేన పార్టీ సమావేశంలో నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. నాదెండ్ల చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన మాట్లాడిన వీడియోను నెటిజన్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

Advertisement