అక్షరటుడే, ఎల్లారెడ్డి: ప్రాచీన కట్టడాల పునరుద్ధరణకు ఇన్ఫోసిస్ సంస్థ ముందుకు రావడం అభినందనీయమని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. లింగంపేటలోని నాగన్న బావిని గురువారం ఇన్ఫోసిస్ వైస్ ప్రెసిడెంట్ కల్పనా రమేశ్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాచీన కట్టడాలను భావితరాలకు తెలియజేయడానికి స్వచ్ఛంద సంస్థలు వాటిని పునరుద్ధరించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకం ద్వారా బావికి వెళ్లడానికి రోడ్డు వేయాలని అధికారులకు చెప్పారు. రోడ్డుకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ ద్వారా మొక్కలు నాటాలని సూచించారు. హైమాస్ లైట్లు ఏర్పాటు చేయాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ఎంపీడీవో నరేశ్, పంచాయతీరాజ్ డిప్యూటీ ఈఈ గిరి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.