అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: నగరంలోని నాగరంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 80 కార్టర్స్‌కు చెందిన నాగరాజ్ గౌడ్(54) సోమవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణం చేసుకున్నాడు. ఐదోటౌన్ ఎస్సై గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం.. నాగరాజ్ గౌడ్‌కు భార్య మాధవితో పాటు ఇద్దరు కుమారులున్నారు. అయితే మాధవికి పెద్దమ్మ ఉండగా ఆమెకు సంతానం లేరు. కాగా ఆమె పేరిట నిజామాబాద్ రూరల్ మండలం ముత్తకుంట గ్రామంలో 20 గుంటల భూమి ఉంది. దీనిని మాధవి పేరిట రిజిస్ట్రేషన్ చేయిస్తానని చెప్పింది. దీంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయించేందుకు తన స్నేహితుడు మల్లేశ్‌ను సంప్రదించాడు. అయితే భూమిని సదరు వ్యక్తి మాధవి పేరిట కాకుండా ఇతర వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించాడు. దీంతో స్నేహితుడిని నమ్మి మోసపోయానని గత కొన్ని రోజులుగా పనిమానేసి తాగుతున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి కుటుంబ సభ్యులతో గొడవ జరిగింది. ఈ క్రమంలో మనస్తాపానికి గురై ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.