BJP | తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా నైనార్‌ నాగేంద్రన్!

BJP | తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా నైనార్‌ నాగేంద్రన్!
BJP | తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా నైనార్‌ నాగేంద్రన్!

అక్షరటుడే, వెబ్​డెస్క్ : BJP | తమిళనాడు(Tamilanadu) బీజేపీ అధ్యక్షుడిగా(State President) నైనార్‌ నాగేంద్రన్(Nainar Nagendran) ఎన్నిక దాదాపు ఖరారైంది. ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై(Annamalai) ఇటీవల తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నూతన అధ్యక్షుడి ఎన్నిక కోసం శుక్రవారం కేంద్ర హోం మంత్రి అమిత్​ షా(Amit sha) తమిళనాడు వచ్చారు.

Advertisement

నూతన అధ్యక్ష పదవికి నైనార్‌ నాగేంద్రన్ ఒక్కరే నామినేషన్​ వేశారు. ఆయనను మాజీ అధ్యక్షుడు అన్నామలై, మురుగన్ బలపరిచాడు. ఒకే నామినేషన్​ రావడంతో తమిళనాడు బీజేపీ 13వ అధ్యక్షుడిగా నాగేంద్రన్ ఎన్నిక కానున్నారు. అయితే ఆయన ఎన్నికైనట్లు శనివారం అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం.

ఇది కూడా చ‌ద‌వండి :  Nainar Nagendran | తమిళనాడు బీజేపీ చీఫ్‌గా నైనార్‌ నాగేంద్రన్‌.. ఆయనే ఎందుకంటే..!

BJP | కార్యాలయంలో ఉద్రిక్తత

తమిళనాడు రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో శుక్రవారం ఉదయం స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి కోసం నామినేషన్‌ వేయడానికి వచ్చిన నైనార్‌ నాగేంద్రన్ అన్నామలై వర్గీయులు అడ్డుకున్నారు. అన్నామలైనే కొనసాగించాలని నినాదాలు చేశారు. అయితే వారికి అన్నామలై సర్ది చెప్పారు.

Advertisement