అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్‌కు అదానీ సంస్థ లంచం ఇచ్చారంటూ సెంటర్‌ ఫర్‌ లిబర్టీ సంస్థ వ్యవస్థాపకుడు నల్లమోతు చక్రవర్తి ఏసీబీకి ఫిర్యాదు చేశారు. అదానీ సంస్థ రూ. 1750 కోట్లు జగన్‌కు లంచం ఇచ్చినట్లు అమెరికా ఏజెన్సీ విచారణలో తేలిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. సెకీతో అదానీ కంపెనీ ఒప్పందంపై విచారణ జరిపి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.