అక్షరటుడే, ఆర్మూర్: లిఫ్ట్ ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని నందిపేట్ ఎస్సై చిరంజీవి సూచించారు. నందిపేట పోలీస్ స్టేషన్లో సోమవారం నందిపేట, డొంకేశ్వర్ మండలాల లిఫ్ట్ ఛైర్మన్‌లతో సమావేశాన్ని నిర్వహించారు. లిఫ్ట్ ట్రాన్స్‌ఫార్మర్ల చోరీ సమస్యపై చర్చించారు. అవసరమైతే వాచ్‌మెన్లను నియమించుకోవాలని ఎస్సై సూచించారు.