అక్షరటుడే, వెబ్‌డెస్క్ Nani : హీరోగానే కాదు నిర్మాతగా కూడా నాని అదరగొట్టేస్తున్నాడు. అ! తో నిర్మాతగా మారిన నాని హిట్ ఫ్రాంచైజీలకు నిర్మాతగా కొనసాగుతున్నాడు. ప్రశాంతితో కలిసి నాని నిర్మిస్తున్న సినిమాలు కమర్షియల్ గా బాగా వర్క్ అవుట్ అవుతున్నాయి. నాని లేటెస్ట్ గా కోర్ట్ అనే సినిమా తీశాడు. రోషన్, శ్రీదేవి, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కోర్ట్ సినిమాను రాం జగదీష్ డైరెక్ట్ చేశారు.
ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాకు ప్రీమియర్స్ వేయగా సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇదిలాఉంటే నాని ఈ సినిమాను 9 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా రిలీజ్ కు ముందే లాభాలు వచ్చినట్టు తెలుస్తుంది. నాని నిర్మాతగా సినిమా అనగానే ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. అందులో భాగంగా కోర్ట్ లాంటి డిఫరెంట్ సినిమా అనగానే ఆడియన్స్ లో క్రేజ్ పెరిగింది.
Nani : 9 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా
కోర్ట్ సినిమా 9 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా నాన్ థియేట్రికల్ బిజినెస్ తోనే లాభాలు వచ్చాయని తెలుస్తుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ కి 8 కోట్ల దాకా కోట్ చేశారట. ఇక మ్యూజిక్ రైట్స్ రూపంలో 30 లక్షలు, శాటిలైట్ రైట్స్ కి మరో 2 కోట్లు వచ్చాయట. అంటే సినిమాను టేబుల్ ప్రాఫిట్ తో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇక థియేట్రికల్ రిలీజ్ తో వచ్చేది అంతా లాభమే అన్నమాట.
నాని హీరోగానే కాదు నిర్మాతగా కూడా సూపర్ సక్సెస్ అనిపించుకుంటున్నాడు. కోర్ట్ సినిమాలో నాని ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కొన్ని విషయాల మీద చాలా క్లియర్ గా ప్రస్తావించారని తెలుస్తుంది. నాని కోర్ట్ సినిమాలో శివాజి కూడా తన పాత్రలో అదరగొట్టినట్టు తెలుస్తుంది. నాని కోర్ట్ సినిమా శుక్రవారం రిలీజ్ అవుతుండగా ఇప్పటికే కొన్నిచోట్ల పెయిడ్ ప్రీమియర్స్ వేశారు. ఈ సినిమాకు పోటీగా కిరణ్ అబ్బవరం దిల్ రూబా సినిమా రిలీజ్ అవుతుంది.