అక్షర టుడే, వెబ్ డెస్క్ Adhitya 369 : నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా సింగీతం శ్రీనివాస్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా ఆదిత్య 369. శ్రీదేవి మూవీస్ బ్యానర్ లో శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా 1991 లో వచ్చింది. మొదటి ఇండియన్ టైం ట్రావెల్ సినిమాగా ఆదిత్య 369 (Aditya 369) సెన్సేషనల్ హిట్ అందుకుంది. ఈ సినిమా లో బాలకృష్ణ డ్యుయల్ రోల్ అదిరిపోయింది.
ఐతే ఆ సినిమా వచ్చిన ఇన్నాళ్లకు సరికొత్త సాంకేతికతతో మళ్లీ ఆదిత్య 369 ని (Aditya 369) రీ రిలీజ్ చేస్తున్నారు. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఆదిత్య 369 సినిమాకు తెలుగు హీరోలు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా న్యాచురల్ స్టార్ నాని (Natural Star Nani) ఆదిత్య 369 సినిమాకు ప్రమోట్ చేస్తున్నాడు.
Adhitya 369 : సినిమా రీ రిలీజ్ పోస్టర్ ని సోషల్ మీడియా స్టేటస్ లో..
సినిమా రీ రిలీజ్ పోస్టర్ ని తన సోషల్ మీడియా (Social media) ఖాతా స్టేటస్ లో పెట్టాడు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ.. ఈమధ్యనే జున్నుతో కలిసి ఈ సినిమా సూపర్ ఎంజాయ్ చేశాం. మీరు కూడా మీ పిల్లని తీసుకెళ్లండి అంటూ ఆదిత్య 369 (Aditya 369) గురించి చెప్పాడు నాని. నందమూరి ఫ్యాన్స్ నాని పెట్టిన స్టేటస్ చూసి సూపర్ అనేస్తున్నారు.
నాని సినిమా ప్రేమికుడు. సినిమా అది కొత్తదా పాతదా కాదు ప్రేక్షకులకు మంచి అనుభూతి కలిగిస్తిందని తెలిస్తే చాలు దాన్ని తను బాధ్యతగా ప్రమోట్ చేస్తాడు. ఆదిత్య 369 సినిమా నిర్మించిన శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ ఇదివరకు నానితో సినిమాలు నిర్మించాడు. మరి ఈ సూపర్ హిట్ టైం ట్రావెల్ సినిమా రీ రిలీజ్ తో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. బాలకృష్ణ (Balakrishna) (Aditya 369) ఆదిత్య 369 సినిమాకు సీక్వెల్ గా కథ సిద్ధం చేశారు. ఆ సినిమాను ఆయనే డైరెక్ట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. వరుస సినిమాల వల్ల ఆదిత్య 999 (Aditya 999) సినిమా చేయలేకపోతున్నారు బాలయ్య. ఐతే ఆదిత్య 369 ఫ్యాన్స్ ఆ సినిమా సీక్వెల్ కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.