అక్షరటుడే, వెబ్‌డెస్క్ Nani : కంటెంట్ ఉంటే సినిమా పెద్దదా? చిన్నదా? అన్న తేడా లేకుండా తాము ఆ సినిమాని ఆదరిస్తామని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు నిరూపిస్తూనే ఉంటారు. చిన్న సినిమాగా విడుదలై పెద్ద హిట్ అయిన చిత్రాలు టాలీవుడ్‌లో ఎన్నో వచ్చాయి. కోవిడ్ తర్వాత కంటెంట్ ఉన్న సినిమాలకు ఆదరణ కురిపిస్తూ కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నారు టాలీవుడ్ జనాలు. బలగం, కమిటీ కుర్రోళ్లు, ఆయ్ వంటి చిత్రాలు చిన్న సినిమాలుగా రూపొంది బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచి కాసుల వర్షం కురిపించాయి. ఇప్పుడు ఈ కోవలోకే వస్తుంది నాని నిర్మించిన Court Movie కోర్ట్ చిత్రం.
Nani : కలెక్షన్ల వర్షం.
ప్రియదర్శి Priyadarshi హీరోగా వచ్చిన ఈ కోర్ట్ Court డ్రామా సంచలన విజయం సాధించింది. ఈ చిత్రంలో హర్ష్ రోషన్, సాయికుమార్, శివాజీ, హర్షవర్థన్, రోహిణి, రాజశేఖర్ అనింగి, సురభి ప్రభావతి, విషికా కీర్తి, శ్రీదేవి అపాళ్ల తదితరులు కీలకపాత్రలు పోషించారు. విజయ్ బుల్గానియన్ సంగీత దర్శకత్వం వహించారు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్నేనేని ఈ సినిమాను దాదాపు రూ.10 కోట్ల నిర్మాణ వ్యయంతో తెరకెక్కించగా.. నేచురల్ స్టార్ నాని సమర్పకుడిగా వ్యవహరించారు. 2 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా 4 రోజుల్లో రూ.12.54 కోట్ల షేర్ రాబట్టగా, గ్రాస్ పరంగా చూసుకుంటే రూ.30 కోట్ల వరకు కొల్లగొట్టింది.
అంటే చిన్న హీరోలతో సినిమా చేసిన కూడా కంటెంట్ ఉంటే అది పెద్ద హిట్ అవుతుందని కోర్ట్ నిరూపించింది. 2025లో విడుదలైన తెలుగు సినిమాలలో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రాల్లో కోర్ట్ 5వ స్థానం దక్కించుకుంది. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ (రూ.90 కోట్లు), డాకు మహారాజ్ (రూ.50 కోట్లు), సంక్రాంతికి వస్తున్నాం (రూ.44 కోట్లు) , తండేల్ (రూ.20.5 కోట్లు) ముందుండగా, ఆ తర్వాతి స్థానంలో Court Movie కోర్ట్ మూవీ నిలిచింది. మరి ఈ వర్కింగ్ డేస్‌లో, పరీక్షల సీజన్‌లో ప్రియదర్శి చిత్రం ఇంకెంత కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి. ఏది ఏమైన కోర్ట్ సినిమాకి ఆదరణ క్రమేపి పెరుగుతూ పోతుండడం విశేషం.
#Nani PROVES that If Content is PERFECT means Teenage Actors also hit 30 CRORES Just in 4 Days #Court 🥵🥵🥵🔥🔥🔥#Nani Presents going to be a BIG BRAND Now ✅pic.twitter.com/8TS4Db9SsE
— GetsCinema (@GetsCinema) March 18, 2025