అక్షరటుడే, వెబ్‌డెస్క్ Nara Lokesh : చంద్రబాబు నాయుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ ఇప్పుడు ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్‌గా మారారు. గతంలో ప్రత్యర్థులపై పంచ్‌లు వేసే క్రమంలో పలు విమర్శలు అందుకున్న నారా లోకేష్ ఇప్పుడు రాటు దేలారు. ఏ సబ్జెక్ట్‌పైన అయినా సరే తనదైన శైలిలో స్పందిస్తున్నారు. తాజాగా ఏపీ మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నేషనల్ మీడియా ఇండియా టుడే నిర్వహించిన కాంక్లెవ్ లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఓ యాంకర్ ఈ ఇద్దరినీ సరదాగా ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో ఫుడ్, ఏపీ ప్లేసెస్, సినిమాల గురించి అడగగా, వారు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు.
Nara Lokesh : లోకేష్ సమాధానం..
రాపిడ్ ఫైర్ ఇంటర్వ్యూలో రామ్మోహన్ నాయుడు, నారా లోకేష్ ఆంధ్ర వంటకాల్లో ఇష్టమైనవి, ఇష్టమైన ప్రదేశాల గురించి చెప్పుకొచ్చారు. తనకి ఏపీలో ఉలవచారు, ఉలవచారు బిర్యానీ అంటే ఇష్టం అని అలానే మిగతా ప్రశ్నలకు వెంటవెంటనే సమాధానాలు ఇచ్చారు లోకేష్. కానీ చివరలో అతని పెద్ద పరీక్షే ఎదురైంది. చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురిలో ఫేవరేట్ హీరో ఎవరు అని అడగ్గా నారా లోకేష్.. అందరూ ఇష్టమే. కానీ చిన్నప్పటి నుంచి బాలయ్య బాబు నా ఫేవరేట్ హీరో. రీసెంట్గా వచ్చిన డాకు మహారాజ్ సినిమా చూసాను. దానికి 4.5 రేటింగ్ ఇస్తాను అని చెప్పుకొచ్చారు.
పవన్ కళ్యాణ్ సంగతేంటి అని యాంకర్ ఇరుకునపెట్టే ప్రశ్న వేయగా .. ఆయన నాకు పర్సనల్‌గా తెలుసు, మంచి నటుడు అని రామ్మోహన్ నాయుడు తెలిపారు. పుష్ప గురించి ప్రస్తావన రాగా.. అలాంటి సినిమాలు ఇప్పటి జనరేషన్‌ను నాశనం చేస్తున్నాయన్నారు. ఇక ఏపీ ప్లేసెస్ గురించి అడగ్గా ఏపీలో అరకు, శ్రీశైలంను అందరూ తప్పక చూడాల్సిన ప్రాంతాలు అని అన్నారు. ఇలా నారా లోకేష్ హీరోలు, సినిమాలు గురించి మాట్లాడటంతో ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.