అక్షరటుడే, ఇందూరు: తమ సమస్యను వివరించేందుకు ఓ బాధితురాలు సోమవారం ప్రజావాణికి అంబులెన్స్‌లో వచ్చింది. దీంతో ఆర్డీవో అంబులెన్స్ వద్దకు వచ్చి సమస్యను తెలుసుకున్నారు. తమ భూమిలోని కొంత స్థలాన్ని కొండూరు శివారు నల్లపోచమ్మ ఆలయానికి విరాళంగా ఇవ్వగా.. కొందరు కబ్జా చేశారని యజమాని మణెమ్మ, ఆమె కొడుకు నరసింహ ఆర్డీవో ఎదుట వాపోయారు. ఆలయ సమీపంలో తమకు 12 ఎకరాల 11 గుంటల స్థలం ఉందన్నారు. అందులోని 38 గుంటలను ఆలయానికి తన తండ్రి శంకర్ దానం చేశారని నరసింహ వివరించారు. అయితే ఇద్దరు వ్యక్తులు చెరో 19 గుంటలు కబ్జా చేశారని తెలిపారు. గతంలో ఎటువంటి ఇబ్బందులు లేవని ధరణి వచ్చాక సమస్య తలెత్తిందని వాపోయారు. వీరి వెంట గ్రామస్థులు వెంకటరెడ్డి, లచ్చిరెడ్డి, శ్రీనివాసరావు, ప్రవీణ్, బాగారెడ్డి తదితరులు ఉన్నారు.
అంబులెన్స్‌లో కలెక్టరేట్‌కు బాధితులు
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : Rajiv Yuva Vikasam : రాజీవ్ యువవికాసం పథకానికి అప్లై చేసిన వారికీ భట్టి గుడ్ న్యూస్..!
Advertisement