అక్షరటుడే, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని త్రివేణి సంగమమైన ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాకు భక్తులు పోతెత్తుతున్నారు. కోట్లాది మంది పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. లక్షల సంఖ్యలో సాధువులు, స్వామీజీలు, బాబాలు కుంభమేళాకు వస్తున్నారు. ఈ క్రమంలో పలువురు భక్తులను ఆకర్షిస్తున్నారు. ఆరు కేజీల బంగారం ధరించిన గోల్డెన్ బాబా కుంభమేళాలో పాల్గొన్నారు. నిరంజన్ అకాడకు చెందిన నారాయణ్ నందు గిరిజీ మహరాజ్ 6 కిలోల బంగారు ఆభరణాలు ధరించి కుంభమేళాకు వచ్చారు. బంగారం శరీరానికి పాజిటివ్ ఎనర్జీ ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.
Advertisement
Advertisement