అక్షరటుడే,ఆర్మూర్: యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దని నార్కోటిక్స్ డీఎస్పీ సోమనాథం పేర్కొన్నారు. శుక్రవారం ఆర్మూర్ క్షత్రియ ఇంజినీరింగ్ కళాశాలలో మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గంజాయి, మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయ నియంత్రణకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ఇంద్రకరణ్ రెడ్డి, క్షత్రియ విద్యా సంస్థ నిర్వాహకుడు అల్జాపూర్ దేవేందర్, ప్రిన్సిపల్ ఆర్కే పాండే, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.