అక్షరటుడే, వెబ్‌డెస్క్: రహస్యంగా నడుస్తున్న డ్రగ్స్ తయారీ కేంద్రం గుట్టరట్టయింది. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఢిల్లీలోని గౌతమ్‌నగర్ జిల్లా కాసన ఇండస్ట్రీయల్ ఏరియాలో మంగళవారం దాడులు జరిపారు. ఈ దాడుల్లో మెథాంపెటమైన్ డ్రగ్‌ను రహస్యంగా తయారు చేస్తున్న ల్యాబ్‌ను గుర్తించారు. 95 కిలోల ఘన, ద్రవరూపంలో ఉన్న మెథాంపెటమైన్ డ్రగ్‌ను అధికారులు పట్టుకున్నారు. నలుగురు వ్యక్తులను ఎన్‌సీబీ అరెస్టు చేసినట్లు డీడీజీ (ఆపరేషన్స్) జ్ఞానేశ్వర్ సింగ్ తెలిపారు. కాగా ఈ ల్యాబ్‌ను తీహడ్ జైలు వార్డెన్, ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారవేత్త, ముంబయికి చెందిన ఓ కెమిస్ట్ నిర్వహిస్తున్నారని అధికారులు వెల్లడించారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ.వందల కోట్లలో ఉంటుందని అంచనా.