
అక్షరటుడే, వెబ్‌డెస్క్: sunita williams | నాసా ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ తన క్రూ మెంబర్స్ బుచ్ విల్మర్, నిక్ హేగ్, అలెగ్జాండర్ గోర్బునోవ్‌లతో కలిసి స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్‌లో భూమికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ రోజు ఉదయం 8.30 గంటలకు హ్యాచ్ మూసివేత పూర్తయి, 10.30కు అన్‌డాకింగ్ ప్రక్రియ మొదలైంది. ఇక అంతరిక్ష కేంద్రం నుండి విడిపోయాక బుధవారం వేకువ జామున 3:27 గంటలకి ఫ్లోరిడా తీరంలో ల్యాండ్ కానుంది. ఈ క్రమంలో సునీత విలయమ్స్ జీతం ఎంత, ఓవర్ టైమ్ చేసినందుకు ఎంత మొత్తం ఇస్తారు వంటి విషయాలపై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తుంది.
sunita williams | వారి జీతం ఎంత?
ఇతర ఉద్యోగాలు మాదిరిగా కాకుండా వ్యోమగాములకు ఎక్కువ రోజులు మిషన్‌లో ఉన్నందుకు అదనపు జీతం ఏమి ఇవ్వరని నిపుణులు చెబుతున్నారు. వ్యోమగాములు ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి, అంతరిక్షంలో గడిపిన సమయాన్ని సాధారణ డ్యూటీగానే పరిగణిస్తారని, ఎక్కువ రోజులు మిషన్‌లో ఉన్నందుకు అదనపు డబ్బులు ఇవ్వరని రిటైర్డ్ నాసా వ్యోమగామి క్యాడీ కోల్‌మన్ వివరించారు.వీరి బేసిక్ సాలరీ 1,25,133 డాలర్ల నుంచి 1,62,672 డాలర్ల (భారత కరెన్సీలో రూ. 1.08 కోట్ల నుంచి రూ. 1.41కోట్ల మధ్య) ఉంటుంది. అయితే ఈ వ్యోమగాములు అంతరిక్షంలో చిక్కుకుపోయినట్టు నాసా చెప్పడం లేదు. 9 నెలలు గడుస్తున్నా వారు ఐఎస్ఎస్ లోనే సాధారణంగా విధులు నిర్వహిస్తున్నారంటూ పేర్కొంది.
2010-11లో 159 రోజుల మిషన్‌లో కోల్‌మన్ $636 (రూ.55,000 పైగా) తీసుకున్నారు. అదే లెక్క ప్రకారం, విలియమ్స్, విల్మోర్ 287 రోజులకు పైగా అంతరిక్షంలో ఉన్నారు కాబట్టి, ఒక్కొక్కరికి అదనంగా $1,148 (సుమారు రూ.1 లక్ష) వస్తుంది. అయితే 9 నెలలు ఐఎస్ఎస్ లో ఉన్నందుకు వారి జీతం $93,850 నుంచి $122,004 (సుమారు రూ.81 లక్షల నుంచి రూ.1.05 కోట్ల) మధ్య ఉంటుందని అంచనా. దీనికి అదనంగా $1,148 కలుపుకుంటే, వారి మొత్తం సంపాదన $94,998 నుంచి $123,152 (సుమారు రూ.82 లక్షల నుంచి రూ.1.06 కోట్ల) వరకు ఉంటుంది