అక్షరటుడే, బాన్సువాడ: నస్రుల్లాబాద్ మండల కేంద్రంలోని ఓ ఏటీఎంలో చోరీకి విఫలయత్నం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బస్టాండ్ వద్ద గల ఇండియా వన్ ఏటీఎంలో గురువారం అర్థరాత్రి దుండగులు చోరికి యత్నించారు. ఏటీఎం వెనుక గది తాళం పగుల గొట్టడంతో పాటు అద్దాలు ధ్వంసం చేశారు. ఎలాంటి డబ్బులు దొరక్కపోవడంతో పారిపోయారు. సీసీ టీవీ దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.