అక్షరటుడే, ఇందూరు: రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు చేతినిండా పని కల్పించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో బుధవారం చేనేత దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అగ్గిపెట్టెలో పట్టేంత పట్టుచీరలు నేసిన ఘనత చేనేత కార్మికులదన్నారు. వారి శ్రమను గుర్తించిన ప్రధాని నరేంద్ర మోదీ 2015 ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. గతంలో చేనేత రంగంలో ప్రతిభ కనబరిచిన 72 మందికి అవార్డులు కూడా అందజేశారన్నారు. తాను చేనేత కార్మికులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అనంతరం పలువురు కార్మికులను సన్మానించారు. కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, రాష్ట్ర అధికార ప్రతినిధి స్వామియాదవ్, విజయ, బీజేపీ నాయకులు లక్ష్మీనారాయణ, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు రామకృష్ణ, కార్పొరేటర్ మాస్టర్ శంకర్, సుదర్శన్, కిషోర్, సత్యపాల్, గిరిబాబు, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.